నేటి నుంచి దస్తావేజు లేఖర్ల పెన్‌డౌన్
ABN , Publish Date - Sep 18 , 2025 | 11:59 PM
సాంకేతిక పరంగా రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలంటూ దస్తావేజు లేఖర్లు శుక్రవారం నుంచి రెండు రోజులపాటు పెన్‌డౌన్ చేస్తున్నారు.
భోగాపురం, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): సాంకేతిక పరంగా రిజిస్ట్రేషన్లకు సంబంధించి ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలంటూ దస్తావేజు లేఖర్లు శుక్రవారం నుంచి రెండు రోజులపాటు పెన్‌డౌన్ చేస్తున్నారు. ఈమేరకు గురువారం స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ పి.రామకృష్ణకు వారు వినతిపత్రం అందజేశారు.
కొత్తవలస, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): కొత్తవలస సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో గల కొత్తవలస, వేపాడ, లక్కవరపుకోట మండలాలకు చెందిన దస్తావేజు లేఖర్లు శుక్ర, శనివారాలలో పెన్‌డౌన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈమేరకు కొత్తవలస సబ్ రిజస్ట్రార్‌కు వినతిపత్రం ఇచ్చినట్టు సంఘం ప్రతినిధి ఐతంశెటి శివప్రసాద్ గురువారం తెలిపారు.