పెండింగ్ పనులు పూర్తిచేయాలి
ABN , Publish Date - Nov 05 , 2025 | 11:55 PM
గతంలో విస్తరణ సమయంలో చేపట్టిన పలు రోడ్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, పెండింగ్ రోడ్ల పనులను దశలవారీగా పూర్తి చేసేందుకు సహకరించాలని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కోరారు.
విజయనగరం రూరల్, నవంబరు 5 ( ఆంధ్రజ్యోతి): గతంలో విస్తరణ సమయంలో చేపట్టిన పలు రోడ్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని, పెండింగ్ రోడ్ల పనులను దశలవారీగా పూర్తి చేసేందుకు సహకరించాలని విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కోరారు. బుధవారం కలెక్టరు రామసుందర్‌రెడ్డిని ఆయన చాంబర్లో కలిశారు. నియోజకవర్గంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్క రించాలని కలెక్టరును కోరారు. వైఎస్సార్ నగర్‌కు వెళ్లే రహదారిలో వర్షం నీరు అధికంగా ఉండిపోవడంతో ఆ ప్రాంత వాసులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పెద్దచెరువు నుంచి నీరు పద్మావతి నగర్ మీదుగా బయటకు వెళ్లేందుకు వీలుగా కాలువ పనులు చేపట్టాలని కోరారు.