Share News

పెండింగ్‌ బిల్లులు విడుదల

ABN , Publish Date - Aug 17 , 2025 | 12:06 AM

రాష్ట్ర ప్రభు త్వం మినీ గోకులాలకు, సీసీ రోడ్లుకు పెండింగ్‌లో ఉన్న నిధులు విడుదల చేసిందని ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు.

పెండింగ్‌ బిల్లులు విడుదల
మాట్లాడుతున్న నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి

  • 2014-19లో ఎన్‌ఆర్‌జీఎస్‌లో భాగంగా చేపట్టిన పనులకు లబ్ధిదారుల ఖాతాల్లో

    జమ కానున్న నిధులు

  • ఎస్‌.కోట నియోజకవర్గానికి రూ.4.20కోట్లు

లక్కవరపుకోట, ఆగస్టు 16(ఆంధజ్యోతి): రాష్ట్ర ప్రభు త్వం మినీ గోకులాలకు, సీసీ రోడ్లుకు పెండింగ్‌లో ఉన్న నిధులు విడుదల చేసిందని ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి తెలిపారు. శనివారం ఆమె లక్కవరపు కోటలోని తన నివాసంలో సుమారు 500 మంది రైతు లతో సమావేశమయ్యారు. నియోజక వర్గంలోని 5 మం డలాలకు సుమారు రూ.4.20 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు. అందుకు సంబంధించిన పత్రాలను రైతులకు అందజేశారు. 2014-19లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పాడి రైతులకు మినీ గోకులాలు, గ్రామాల అభివృద్ధికి సీసీ రోడ్లు మంజూరు చేశారని, అప్పట్లో కొంతమేర బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయా యని ఆమె తెలిపారు. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్‌ రెడ్డి వాటన్నింటీనీ తుంగలోకి తొక్కేశారని మండిపడ్డా రు. మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం వాటన్నింటికీ బిల్లులు మంజూరు చేసి, రైతుల కళ్లలో ఆనందం నింపిందన్నా రు. విడుదలైన నిధుల్లో గోకులం షెడ్లు, సీసీ రోడ్లు, ఎస్‌డబ్ల్యూసీ షెడ్లు, శ్మశాన వాటిక షెడ్లు ఉన్నాయన్నా రు. ఎస్‌.కోట మండలానికి 156 మందికి 169 పనులకు సంబంధించి రూ.43 లక్షలు, కొత్తవలస మండలానికి 82 మందికి 243 పనులకు సంబంధించి రూ.కోటి 20ల క్షలు, జామి మండలానికి 76 మందికి 124 పనులకుగా ను సుమారు రూ.35లక్షల 50వేలు, వేపాడకు సంబం ధించి 150 మందికి 187 పనులకుగానూ సుమారు 50 మందికి 187 పనులకు గానూ సుమారు రూ.50లక్షలు, ఎల్‌.కోటకు సంబంధించి 395 మందికి 474 పనులకు సుమారు కోటి రూపాయలకుపైగా నిధులు విడుదలైన ట్టు చెప్పారు. ఈ వారంలో వీరందరికీ వారి ఖాతాల్లో నగదు జమ కానున్నదన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ చొక్కాకుల మల్లునాయుడు, కొల్ల శ్రీను, రత్నాజీ, దుర్గా ఉమేష్‌, డీఈ స్వామినాయుడు, 5 మండలాల పీఆర్‌ ఇంజనీర్లు, ఏపీవోలు, ఈసీలు, టీఏలు, ఎఫ్‌ఏలు, రైతులు హాజరయ్యారు.

  • నెల్లిమర్ల నియోజకవర్గానికి రూ.73.58లక్షలు

డెంకాడ, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): నెల్లిమర్ల నియోజకవర్గంలో 2014-19 ఆర్థిక సంవత్సంలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన పనులకు సంబంధించిన నిధులను కూటమి ప్రభుత్వం విడుదల చేసిందని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి తెలిపారు. శనివారం డెంకాడ వెలుగు కార్యాలయంలో నిర్వహించి న కార్యక్రమంలో ఆమె పాల్గొని, మాట్లాడారు. 2014-19 సంవత్సరాల్లో ఎన్‌ఆర్‌జీఎస్‌ ద్వారా చేపట్టిన గోకులం షెడ్ల లబ్ధిదారులకు పెండింగ్‌ నిధులను వారి ఖాతా ల్లోకి జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంద ని ఆమె తెలిపారు. నియోజకవర్గంలో 340 ఎన్‌ఆర్‌ఈజీ ఎస్‌ పనులకుగాను సుమారు రూ.73.58లక్షల నిధులను వండర్స్‌ ద్వారా విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నరని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖర్‌రావు, ఉపాధి హామీ పథకం సిబ్బంది, రైతులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 17 , 2025 | 12:06 AM