Share News

Nuthana’ Celebrations శాంతియుతంగా ‘నూతన’ వేడుకలు

ABN , Publish Date - Dec 30 , 2025 | 11:23 PM

Peaceful ‘Nuthana’ Celebrations ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో నూతన సంవ త్సర వేడుకలు జరుపుకోవాలని ఎస్పీ మాధవరెడ్డి సూచించారు.

 Nuthana’ Celebrations శాంతియుతంగా ‘నూతన’ వేడుకలు
మాట్లాడుతున్న ఎస్పీ మాధవరెడ్డి

  • నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

బెలగాం, డిసెంబరు30(ఆంధ్రజ్యోతి): ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో నూతన సంవ త్సర వేడుకలు జరుపుకోవాలని ఎస్పీ మాధవరెడ్డి సూచించారు. మంగళవారం తన కార్యాలయంలో విలేఖర్లతో మాట్లాడుతూ.. ‘అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత ఎవరూ రోడ్లపై తిరగరాదు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. బుధవారం రాత్రి బహిరంగ ప్రదేశాల్లో రహదారులపై నూతన ఏడాది వేడుకలను నిర్వహించరాదు. డీజేలతో ప్రజలను ఇబ్బంది పెట్టరాదు. మద్యం తాగి వాహనాలు నడపరాదు. ప్రత్యేకంగా డ్రంకెన్‌ డ్రైవ్‌ నిర్వహించి కేసులు నమోదు చేస్తాం. ’ అని తెలిపారు.

Updated Date - Dec 30 , 2025 | 11:23 PM