Share News

వేతనాలు సక్రమంగా ఇవ్వండి

ABN , Publish Date - Mar 13 , 2025 | 12:22 AM

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌వీఎస్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు.

వేతనాలు సక్రమంగా ఇవ్వండి
జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరసన తెలుపుతున్న కార్మికులు

బెలగాం, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌వీఎస్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం ఏఐటీయూసీ ఆధ్వర్యం లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కార్మికులు నిరసన తెలిపారు. అనంతరం ఆసుపత్రి ఆర్‌ఎం డా.శ్యామలకు వినతిపత్రం ఇచ్చారు. ఈసందర్భంగా కుమార్‌ మాట్లాడు తూ ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్‌, సెక్యూరిటీ విభా గంలో పనిచేస్తున్న కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పై అనేక సార్లు పోరాటాలు చేసిన వారి సమస్యలు పరిష్కరించడం లేదన్నారు. టీవీటీ గ్రూప్‌, స్కాట్లాండ్‌ వారు కార్మికుల శ్రమను దోచుకుంటు న్నారని ఆరోపించారు. ప్రతి నెల వేతనాలు సక్రమంగా ఇవ్వడం లేదని, వేతనానికి తగిన పీఎఫ్‌ జమ చేయడంలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు ఎ.కుమారమ్మ, రవి, కమల, ఆసుపత్రి కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 13 , 2025 | 12:22 AM