క్రీడలపై మక్కువ పెంచుకోవాలి: ఎమ్మెల్యే
ABN , Publish Date - Oct 22 , 2025 | 11:48 PM
చదువుతోపాటు క్రీడలపై మక్కువ పెంచుకోవా లని ఎమ్మెల్యే లోకం నాగమాధవి కోరారు. బుధవారం భోగాపురం జడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జిల్లాస్థాయి అండర్-17 బాలబాలికల వాలీబాల్ పోటీలను ప్రారంభిం చారు. కాగా జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు ఉదయం పదిగంటలకు ప్రారం భించాల్సి ఉండగా ఎమ్మెల్యే 11.45 నిమిషాల వరకు మైదానానికి చేరుకోలేదు.
భోగాపురం, అక్టోబరు22(ఆంధ్రజ్యోతి):చదువుతోపాటు క్రీడలపై మక్కువ పెంచుకోవా లని ఎమ్మెల్యే లోకం నాగమాధవి కోరారు. బుధవారం భోగాపురం జడ్పీ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో జిల్లాస్థాయి అండర్-17 బాలబాలికల వాలీబాల్ పోటీలను ప్రారంభిం చారు. కాగా జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు ఉదయం పదిగంటలకు ప్రారం భించాల్సి ఉండగా ఎమ్మెల్యే 11.45 నిమిషాల వరకు మైదానానికి చేరుకోలేదు. దీంతో కొందరు బాల బాలికలు ఎండను తట్టుకోలేక చెట్టకిందకు చేరుకొని అవస్థలకు గురయ్యారు. అనంతరం జనసేన నాయకుడు పల్లంట్ల జగదీస్ ఆర్థిక సహాయంతో 100 టీషర్టులను బాలబాలి కలకు ఎమ్మెల్యే అందజేశారు.కార్యక్రమంలో నాయకులు పల్లంట్ల జగదీష్, పల్లరాంబాబు, మాతా నవీన్, బొల్లుత్రినాథ్, గుండపుసూరిబాబు, పీఈటీ నాగన్న, చిన్నారి పాల్గొన్నారు.