Share News

Parvathipuram పార్వతీపురానికి 27వ ర్యాంకు!

ABN , Publish Date - Sep 28 , 2025 | 11:23 PM

Parvathipuram Secures 27th Rank రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలకు పది అంశాల ఆధారంగా ప్రభుత్వం ర్యాంకులు ప్రకటించింది. గార్బేజ్‌, వీధి దీపాలు, తాగునీటి నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ, ఆదాయం, రెవెన్యూ స్కోరును పరిగణనలోకి తీసుకున్నారు. దీనిలో భాగంగా జిల్లాలో గ్రేడ్‌-1గా ఉన్న పార్వతీపురం పురపాలక సంఘానికి 27వ ర్యాంకు లభించింది.

Parvathipuram  పార్వతీపురానికి 27వ ర్యాంకు!
పార్వతీపురం మున్సిపల్‌ కార్యాలయం

  • పది అంశాల ఆధారంగా స్కోరింగ్‌ను ప్రకటించిన ప్రభుత్వం

పార్వతీపురం/బెలగాం, 28 సెప్టెంబరు(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 123 మున్సిపాలిటీలకు పది అంశాల ఆధారంగా ప్రభుత్వం ర్యాంకులు ప్రకటించింది. గార్బేజ్‌, వీధి దీపాలు, తాగునీటి నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ, ఆదాయం, రెవెన్యూ స్కోరును పరిగణనలోకి తీసుకున్నారు. దీనిలో భాగంగా జిల్లాలో గ్రేడ్‌-1గా ఉన్న పార్వతీపురం పురపాలక సంఘానికి 27వ ర్యాంకు లభించింది. మొత్తం 100 మార్కులకు గానూ 54 మార్కులతో ఆరు శాతం రేటింగ్‌ దక్కింది. పార్వతీపురం మున్సిపాలిటీలో నీటి సరఫరాకు-7, ఇంటి నుంచి చెత్త సేకరణ-6, పక్కా రోడ్లు-10, వీధి లైటింగ్‌-13, ఆదాయ విభాగంలో-9, రెవెన్యూ విభాగంలో-6 పాయింట్లు వచ్చాయి. మిగతా విభాగాల్లో జీరో స్కోరు లభించింది. 47 మార్కులతో సాలూరుకు 5 శాతం, 34 మార్కులతో పాలకొండకు 4 శాతం రేటింగ్‌ దక్కింది. సాలూరుకు 75, పాలకొండకు-107 ర్యాంకులు వచ్చాయి. కాగా పార్వతీపురం, సాలూరు పురపాలక సంఘాలతో పాటు పాలకొండ నగర పంచాయతీ స్కోరింగ్‌లపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డంపింగ్‌యార్డు, తాగునీరు, ఇతర ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడమే ఈ పరిస్థితికి కారణమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దీనిపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని ఆయా ప్రాంతవాసులు కోరుతున్నారు.

Updated Date - Sep 28 , 2025 | 11:23 PM