Share News

Parvathipuram Manyam జలపాతాల జిల్లాగా పార్వతీపురం మన్యం

ABN , Publish Date - Oct 14 , 2025 | 12:21 AM

Parvathipuram Manyam The Land of Waterfalls జలపాతాల జిల్లాగా పార్వతీపురాన్ని మార్చాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ప్రతి చిన్న జలపాతాన్ని గుర్తించి అందుబాటులోకి తేవాలన్నారు.

 Parvathipuram Manyam  జలపాతాల జిల్లాగా పార్వతీపురం మన్యం
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

  • కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

పార్వతీపురం, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): జలపాతాల జిల్లాగా పార్వతీపురాన్ని మార్చాలని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు. ప్రతి చిన్న జలపాతాన్ని గుర్తించి అందుబాటులోకి తేవాలన్నారు. పర్యాటకుల కోసం వాటిని సుందరంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో అన్ని వసతులు కల్పించాలన్నారు. మన్యంలో డోలీ మోతలు లేకుండా చూడాలని, అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు. ప్రతి గ్రామానికి అంబులెన్స్‌ వెళ్లాలన్నారు. పీజీఆర్‌ఎస్‌లో వచ్చిన వినతులను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. కౌశలం సర్వే వేగవంతం చేయాలని, వారానికి ఒకసారి మీటింగ్‌ నిర్వహించాలని సూచించారు. ఈ సమావశంలో సబ్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలి, డీఆర్వో హేమలత, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 14 , 2025 | 12:21 AM