పాలకొండను జిల్లాగా చేయాలి
ABN , Publish Date - Aug 21 , 2025 | 11:47 PM
లకొండ రెవెన్యూ డివిజన్‌ను జిల్లా చేయాలని, లేకపోతే శ్రీకాకుళం జిల్లాలో కలపాలని పాలకొండ జిల్లా సాధన సమితి నాయకులు కనపాక చౌదరినాయుడు, బుడితి అప్పలనాయుడు, వండాన కూర్మా రావు, సబ్బ నానాజీ డిమాండ్‌చేశారు. గురువారం పాలకొండలోని కోటదుర్గమ్మ ఆలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ స్వప్నిల్ ధనుంజయకు వినతిపత్రం అందజేశారు.
పాలకొండ, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): పాలకొండ రెవెన్యూ డివిజన్‌ను జిల్లా చేయాలని, లేకపోతే శ్రీకాకుళం జిల్లాలో కలపాలని పాలకొండ జిల్లా సాధన సమితి నాయకులు కనపాక చౌదరినాయుడు, బుడితి అప్పలనాయుడు, వండాన కూర్మా రావు, సబ్బ నానాజీ డిమాండ్‌చేశారు. గురువారం పాలకొండలోని కోటదుర్గమ్మ ఆలయం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి సబ్ కలెక్టర్ స్వప్నిల్ ధనుంజయకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయ కులు శిల్లా బ్రహ్మాజీ, లోకనాధంచౌదరి, రామినాయుడు, గణపతి, ఆనాపు శంకరరా వు, కొట్నాన అప్పన్న, అగిగ్రోల్డ్ బాఽధితుల సంఘం అధ్యక్షుడు బెహరా బంగారు, ద్వారపూడి అప్పలనాయుడు, రమణమూర్తి, కిమిడి రామ్మూర్తి పాల్గొన్నారు.