Share News

పాలకొండను జిల్లాగా ప్రకటించాలి

ABN , Publish Date - Aug 18 , 2025 | 12:15 AM

పాలకొండను జిల్లాగా ప్రకటించాలని జిల్లా సాధన సమితి డిమాండ్‌చేసింది. ఆదివారం పాలకొండలో జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో రాజకీయ నాయకులు, మేథావులు, స్థానికుల అభిప్రాయాల ను తెలుసుకొనేందుకు సమావేశం నిర్వహించారు.

పాలకొండను జిల్లాగా ప్రకటించాలి
సమావేశంలో మాట్లాడుతున్న బుడితి అప్పలనాయుడు

పాలకొండ, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): పాలకొండను జిల్లాగా ప్రకటించాలని జిల్లా సాధన సమితి డిమాండ్‌చేసింది. ఆదివారం పాలకొండలో జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో రాజకీయ నాయకులు, మేథావులు, స్థానికుల అభిప్రాయాల ను తెలుసుకొనేందుకు సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా పాలకొండ జిల్లా సాధన సమితి గౌరవాధ్యక్షులు, అధ్యక్షులు కనపాక చౌదరినాయుడు, బుడితి అప్పల నాయుడు మాట్లాడుతూ పాలకొండనుమన్యం జిల్లాలో కలిపి గత ప్రభుత్వం అన్యా యం చేసిందని ఆరోపించారు.పలువురు వక్తలు మాట్లాడుతూ పాలకొండ జిల్లాతోనే అభివృద్ధి సాధ్యమని తెలిపారు. గతంలో మాదిరిగానే పాలకొండను శ్రీకాకుళం జిల్లాలో కలిపేలా ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. సాధనసమితి ఆధ్వర్యంలో ఈనెల 21న పాలకొండలో ర్యాలీ నిర్వహించి, సబ్‌ కలెక్టర్‌కు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రికి జిల్లా సాధన కోసం తెలిసేలా పోస్టుకార్డుల ఉద్యమం నిర్వహించాలని సూచించారు. సమా వేశంలో వండాన కూర్మారావు, సబ్బ నానాజీ, నందాన రమేష్‌, బౌరోతు శంకరరావు, రెడ్డి బాలమురళీకృష్ణ, రాధాకృష్ణ, బాలరాజు, నెల్లి సత్యంనాయుడు పాల్గొన్నారు.

Updated Date - Aug 18 , 2025 | 12:15 AM