Share News

పాలకొండ జిల్లా ఏర్పాటుచేయాలి

ABN , Publish Date - Oct 31 , 2025 | 12:07 AM

పాలకొండను జిల్లా చేయా లని, లేకపోతే శ్రీకాకుళం జిల్లాలో కలపాలని పాలకొండ జిల్లా సాధన సమితి సభ్యులు కోరారు.గురువారం పట్టణంలో పాలకొండ జిల్లా సాధన సమితి అధ్యక్ష, గౌరవాధ్యక్షులు బుడితి అప్పలనాయడు, కనపాక చౌదరి నాయుడు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

పాలకొండ జిల్లా ఏర్పాటుచేయాలి
మాట్లాడుతున్న బుడితి అప్పలనాయుడు

పాలకొండ, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి):పాలకొండను జిల్లా చేయా లని, లేకపోతే శ్రీకాకుళం జిల్లాలో కలపాలని పాలకొండ జిల్లా సాధన సమితి సభ్యులు కోరారు.గురువారం పట్టణంలో పాలకొండ జిల్లా సాధన సమితి అధ్యక్ష, గౌరవాధ్యక్షులు బుడితి అప్పలనాయడు, కనపాక చౌదరి నాయుడు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పలు రాజకీయ పార్టీల నాయకులు హాజరై మద్దతు తెలిపారు. శుక్రవారం కోటదుర్గమ్మ ఆలయ సమీపంలో జరగనున్న నిరాహారదీక్ష విజయవం తం చేయాలని కోరారు. కార్యకమంలో టీడీపీ నాయకులు కర్నేన అప్పల నాయుడు, సంతోష్‌కుమార్‌, వైసీపీ నాయకులు దుప్పాడ పాపినాయుడు, తుమ్మగుంట శంకరరావు, ఉపేంద్రకుమార్‌, కాంగ్రెస నాయకులు బత్తిన మోహన్‌రావు, వర్తక సంఘ నాయకులు సుధాకర్‌ పాల్గొన్నారు. కాగా

నగర పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం

నగర పంచాయతీ పాలకమండలి పాలకొండ జిల్లాగా ప్రకటించాలని లేదా పాలకొండను శ్రీకాకుళం జిల్లాలో కొనసాగించాలని తీర్మానించింది. ఈ మేరకు వైసీపీ టీడీపీ, జనసేన కౌన్సిలర్లు తీర్మానాన్ని బలపరిచారు. కౌన్సిలర్లకు జిల్లా సాధన సమితి అధ్యక్ష, గౌరవాధ్యక్షులు బుడితి అప్పల నాయడు, కనపాక చౌదరినాయుడు మద్దతు కోరారు. అనంతరం నగర పంచాయతీ చైర్‌పర్సన్‌ ఆకుల మల్లీశ్వరికి వినతిపత్రం అందించారు. తొలుత ఎమ్మెల్సీ విక్రాంత్‌,టీడీపీ అరకు పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు పల్లా కొండలరావును కలిసి నిరాహారదీలకు మద్దతుఇవ్వాలని పాలకొండ జిల్లా సాధన సమితి సభ్యులు కోరారు.

Updated Date - Oct 31 , 2025 | 12:08 AM