పీఏసీఎస్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
ABN , Publish Date - Jun 20 , 2025 | 11:53 PM
ఉమ్మడి విజయనగరం జిల్లాలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
పార్వతీపురంటౌన్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి విజయనగరం జిల్లాలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక డీసీసీబీ కార్యాల యం వద్ద నిరసన వ్యక్తం చేశారు. జిల్లా సహకార అధికారి తీరుపై ఆందోళన చేశారు. ఆ సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.సత్యం, బి.రామునాయుడు మాట్లాడుతూ జిల్లాలోని 34 పీఏసీఎస్‌ల్లో విధులు నిర్వ హిస్తున్న 102 మంది సిబ్బంది సమస్యలు పరిష్కరిం చాలని కోరుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోక పోవడం బాధాకరం అన్నారు. 2019 నుంచి 2024 వరకు వేతన సవరణ జరిపి కొత్త జీతాలు నిర్ణయించాల ని కోరారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచే విధంగా డీఎల్‌ఏసీలో తీర్మానించాలన్నారు. 2019 మార్చి 1 తర్వాత విధులను నిర్వహిస్తున్న సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న జీతాలను తక్షణమే చెల్లించా లని, రెగ్యులర్ సిబ్బందిని పీఏసీఎస్‌లో ఖాళీగా ఉన్న సీఈవో పోస్టులకు ఎంపిక చేసి, ఖాళీలను సీనియారిటీ ప్రకారం భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం డీసీసీబీ సీఈవో ఇచ్చిన డీఏ సర్కులర్ ప్రకారం నేటి వరకు డీఏ అమలు కాలేదని, వెంటనే అమలు చేయాలన్నారు. జిల్లాలో పీఏసీఎస్ ఉద్యోగులకు అడ్వాన్సు రూపంలో జీతాలు చెల్లించడం చట్ట విరుద్ధమన్నారు. అందుకే జీతాలు చెల్లించేందుకు పర్సన్ ఇన్‌చార్జులకు తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని కోరారు. తమకు రావాల్సిన వేతన సవరణలు పూర్తి చేసి, కొత్తజీతాలు నిర్ణయించాల ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఆర్వీఎస్ కుమార్ పాల్గొన్నారు.