పి-4 సర్వే పక్కాగా చేపట్టాలి: ఎంపీడీవో
ABN , Publish Date - Mar 14 , 2025 | 12:30 AM
పి -4 సర్వే పక్కాగా చేపట్టాలని ఎంపీడీవో పి.రవికుమార్ ఆదేశించారు. గురువారం మండలంలోని కొండదేవుపల్లి, శివడవలసలో జరుగుతున్న పి-4 సర్వేను పరిశీలించారు.

బొబ్బిలి రూరల్, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): పి -4 సర్వే పక్కాగా చేపట్టాలని ఎంపీడీవో పి.రవికుమార్ ఆదేశించారు. గురువారం మండలంలోని కొండదేవుపల్లి, శివడవలసలో జరుగుతున్న పి-4 సర్వేను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పి-4 సర్వేపై ఇప్పటికే శిక్షణ నిర్వహించడంతో ఎటువంటి అనుమానాలకు తావులేకుండా జాగ్రత్తగా చేయాలని సిబ్బందికి సూచించారు. గ్రామల్లోని ప్రజలు వారి వృత్తుల రీత్యా ఉదయమే బయటకు వెళ్లి, సాయంత్రం తిరిగి వచ్చే అవకాశం ఉందని, దాన్ని దృష్టిలో పెట్టుకొని రెం డు పూటలు సర్వే చేయాలని ఆదేశించారు.ఆయన వెంట పరిపాలనా అధికారి డీవీ అప్పారావు, ఎంసీవో సుధాకర్, సచివాలయ సిబ్బంది ఉన్నారు.
రోడ్లపై చెత్త వేస్తే చర్యలు
రోడ్లపై చెత్త వేస్తే చర్యలు తప్పవని ఎంపీడీవో పి.రవికుమార్ హెచ్చరించా రు.గురువారం మండలంలోని పిరిడిలో పర్యటించారు. గ్రామంలో రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్త, కాలువల్లో సిల్ట్ పేరుకుపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్లు, కాలువలు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని పంచాయతీ సిబ్బందికి ఆదేశించారు.అనంతరం గ్రామస్థుల సహకారంతో కాలువల్లో సిల్ట్ తొ లగించారు. ఆయన వెంట ఎంసీవో సుధాకర్, పంచాయతీ కార్యదర్శి ఉన్నారు.