p4 19 నుంచి పీ-4
ABN , Publish Date - Aug 05 , 2025 | 11:49 PM
p4 from 19th పేదరిక నిర్మూలనలో భాగంగా చేపట్టిన పీ-4 కార్య క్రమాన్ని ఈ నెల 19 నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ప్రత్యేక అధికారులతో సమీక్షించారు.
మార్గదర్శుల ఎంపిక పూర్తి స్వచ్ఛందమే..
కలెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
పార్వతీపురం, ఆగస్టు 5(ఆంద్రజ్యోతి): పేదరిక నిర్మూలనలో భాగంగా చేపట్టిన పీ-4 కార్య క్రమాన్ని ఈ నెల 19 నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు, ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ప్రత్యేక అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘ బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే మార్గదర్శుల ఎంపిక ఈ నెల 19 నాటికి పూర్తికావాలి. అత్యున్నత స్థాయిలో ఉన్న పది శాతం మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి అట్టడుగున ఉన్న 20 శాతం మంది పేదలను అభివృద్ధి చేయాలి. బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకునేలా స్ఫూర్తిదాయకమైన సందేశం ఇవ్వాలి. మార్గదర్శుల పేరిట ఎవరికీ బలవంతం చేయొద్దు. ఈ విషయంలో ఎక్కడా వ్యతిరేకత రాకూడదు. పీ-4 కార్యక్రమం అమలుపై మార్గదర్శ కాలను సిద్ధం చేశాం. అందులో ప్రజాప్రతినిధులు, అధికారులు చేపట్టాల్సిన బాధ్యతలు స్పష్టం చేశాం. మార్గదర్శుల ఎంపిక స్వచ్ఛందంగానే జరగాలి.’ అని తెలిపారు. ఈ సమీక్షలో జిల్లా నుంచి కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్, జేసీ శోభిక, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, ప్రత్యేక ఉప కలెక్టర్లు పి.ఽధర్మచంద్రారెడ్డి, ఎస్.దిలీప్ చక్రవర్తి, డ్వామా పీడీ కె.రామచంద్రరావు, జిల్లా ప్రణాళికాధికారి పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.