34 గ్రామాల్లో స్వామిత్వ సర్వే పూర్తి: డీఎల్‌డీవో
ABN , Publish Date - Aug 27 , 2025 | 12:09 AM
బొబ్బిలి డివిజన్‌లోనే ఇప్పటివరకు 34 గ్రామాల్లో స్వామిత్వ సర్వే పూర్తిచేశామని డీఎల్‌డీవో ఎం.కిరణ్‌కుమార్ తెలిపారు. మంగళవారం రామభద్రపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ డివిజన్‌లోనే బాడంగి, బొబ్బిలి, దత్తిరాజేరు, గజపతినగరం, రామభద్రపురం, మెంటాడ, తెర్లాం మండలాల్లోని మొదటివిడతగా 80 గ్రామాల్లో సర్వే చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
రామభద్రపురం, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): బొబ్బిలి డివిజన్‌లోనే ఇప్పటివరకు 34 గ్రామాల్లో స్వామిత్వ సర్వే పూర్తిచేశామని డీఎల్‌డీవో ఎం.కిరణ్‌కుమార్ తెలిపారు. మంగళవారం రామభద్రపురంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ డివిజన్‌లోనే బాడంగి, బొబ్బిలి, దత్తిరాజేరు, గజపతినగరం, రామభద్రపురం, మెంటాడ, తెర్లాం మండలాల్లోని మొదటివిడతగా 80 గ్రామాల్లో సర్వే చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. మిగతా 46 గ్రామాల్లో కూడా ఈ సర్వే ఈ నెలాఖరులోగా పూర్తిచేస్తామని చెప్పారు. గామాల్లో డ్రోన్, శాటిలైట్ సర్వే కూడా నిర్వహించి ఆన్‌లైన్ చేసి గ్రామసభల ద్వారా ఇంటి యజమానులకు హక్కు పత్రాలు పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ సర్వేలో 41,280 మందిని గుర్తించామని, ఇప్పటివరకు 20, 907 మంది లబ్ధిదారులు సర్వే పూర్తిచేశామని చెప్పారు. అనంతరం దుప్పలపూడి, ముచ్చర్లవలస, బూసాయవలస, నర్సాపురం సచివాలయాలను తనిఖీ చేశారు. సమావేశంలో ఇన్‌చార్జి ఎంపీడీవో సన్యాసిరావు, దుప్పలపూడి పంచాయతీ కార్యదర్శి సతీష్ పాల్గొన్నారు.