సొంతభవనం మంజూరు చేయాలి
ABN , Publish Date - Jul 28 , 2025 | 11:59 PM
తమ గ్రామంలో ఉన్న పాఠశాలకు సొంత భవనం మంజూరు చేయాలని మెంటాడ మండలం రెడ్డివానివలస గ్రామస్థులు తమ పిల్లలతో కలిసి డిమాండ్ చేశారు.
విజయనగరం కలెక్టరేట్, జూలై 28(ఆంధ్రజ్యోతి): తమ గ్రామంలో ఉన్న పాఠశాలకు సొంత భవనం మంజూరు చేయాలని మెంటాడ మండలం రెడ్డివానివలస గ్రామస్థులు తమ పిల్లలతో కలిసి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈసందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు మాట్లాడు తూ 1980లో పాఠశాల భవనం కూలిపోయిందని, ఇప్పటివరకూ భవనం ఏర్పాటు చేయలేదన్నారు. సొంత భనవం లేక ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రాము, శిరీష తదితరులు ఉన్నారు.