Share News

Overcast మూడు రోజులుగా ముసురు

ABN , Publish Date - Jul 01 , 2025 | 11:43 PM

Overcast for Three Days జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజుల నుంచి తెరిపి ఇవ్వడం లేదు. ఏజెన్సీలోనూ ముసురు వాతావరణం నెలకొంది.

Overcast మూడు రోజులుగా ముసురు
సాలూరులో కురుస్తున్న వర్షం

సాలూరు రూరల్‌, జూలై 1(ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత మూడు రోజుల నుంచి తెరిపి ఇవ్వడం లేదు. ఏజెన్సీలోనూ ముసురు వాతావరణం నెలకొంది. సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల్లో మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు వర్షం కురిసింది. కొన్నిచోట్ల జల్లులు, మరికొన్నిచోట్ల ఓ మోస్తరు వాన పడింది. మరోవైపు రైతులు హుషారుగా పొలం పనులు చేసుకుంటున్నారు. పత్తి, మొక్కజొన్న పంటలకు ఈ వర్షం తొలి తడి అందించిందని చెబుతున్నారు. వరి నారుమళ్లకు కూడా మేలు చేస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jul 01 , 2025 | 11:43 PM