Minister Kondapalli Srinivas: మన క్రీడా విధానం ఆదర్శం
ABN , Publish Date - May 13 , 2025 | 11:18 PM
Minister Kondapalli Srinivas:‘క్రీడా విధానంలో మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని’ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
- మంత్రి కొండపల్లి శ్రీనివాస్
విజయనగరం, మే 13(ఆంధ్రజ్యోతి): ‘క్రీడా విధానంలో మన రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని’ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ క్రీడా మైదానంలో జరుగుతున్న 3వ జాతీయ తైక్వాండో శిక్షణ సెమినార్‌కు ఆయన హాజ రయ్యారు. క్రీడాకారులకు ఇస్తున్న శిక్షణను తిలకించారు. ఈ సంద ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క మనరాష్ట్రంలోనే క్రీడాకారులకు ఉద్యోగాల భర్తీలో 3 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని’ తెలిపారు. క్రీడల కోసం పెద్దఎత్తున మౌలిక వస తులు సమకూర్చుతున్నట్లు చెప్పారు. విద్యార్థులు చదువుతో పాటు ఆటల్లో కూడా రాణించి రాష్ట్రానికి, మన ప్రాంతానికి కీర్తిప్రతిష్ఠలు తీసు కురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తైక్వాండో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గురునా అయ్యులు, రాష్ట్రకార్యదర్శి సీహెచ్ వేణుగోపా ల్, అంతర్జాతీయ క్రీడాకారుడు, తైక్వాండో కోచ్ కె.శ్రీహరి పాల్గొన్నారు.