Share News

mahanaadu మహానాడులో మనోళ్లు

ABN , Publish Date - May 28 , 2025 | 12:12 AM

Our People at the mahanaadu టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టే మహానాడు కార్యక్రమం మంగళవారం కడపలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేడుకలో జిల్లా శ్రేణులు సందడి చేశారు.

 mahanaadu మహానాడులో మనోళ్లు
మహానాడు వేదికపై సీఎం చంద్రబాబునాయుడుతో మంత్రి సంధ్యారాణి

పార్వతీపురం/సాలూరురూరల్‌, మే27(ఆంధ్రజ్యోతి): టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టే మహానాడు కార్యక్రమం మంగళవారం కడపలో అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ వేడుకలో జిల్లా శ్రేణులు సందడి చేశారు. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, సాలూరు, పార్వతీపురం, పాలకొండ, కురుపాం నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరై పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. అనంతరం మంత్రి సంధ్యారాణి మాజీ సీఎం జగన్‌పై ధ్వజమెత్తారు. గత ఐదేళ్లూ సైకో జగన్‌ రాష్ట్రవ్యాప్తంగా మహిళలను ఏడిపించారని ఆరోపించారు. అండగా ఉంటానని చెప్పి పథకాలన్నీ రద్దు చేశారని వివరించారు. తల్లి, చెల్లెను గెంటేసిన జగన్‌ కడప పిల్లిగా తయారయ్యారన్నారు. మహిళా సంఘాల సొమ్మును కూడా పక్కదారి పట్టించారని తెలిపారు. ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, కళాశాల సీట్ల కేటాయింపుల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చి సీఎం చంద్రబాబునాయుడు మహిళలకు ఆదుకుంటున్నారని కొనియాడారు. ఒక ఉత్తరం రాసినా, వాట్సాప్‌ పెట్టినా.. మహిళల కన్నీళ్లను మంత్రి లోకేష్‌ తుడుస్తున్నారన్నారు. ప్రభుత్వం నారీశక్తి ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. మహిళల రక్షణకు పార్టీ నేతలు పనిచేయాలని పిలుపునిచ్చారు. అన్నింటా అండగా ఉంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రాష్ట్ర మహిళలు ఎంతో రుణపడి ఉంటారన్నారు.

Updated Date - May 28 , 2025 | 12:12 AM