Share News

మా పోరాటం ఎవరికీ పట్టడం లేదు

ABN , Publish Date - Oct 06 , 2025 | 12:41 AM

జిందాల్‌ కంపెనీ తమను మోసం చేసిందని బొడ్డవర గ్రామంలో గిరిజన, హరిజన, మైనార్టీలు శాంతియు తంగా పోరాటం చేస్తుంటే ఎవరికీ పట్టడం లేదని వారు మండిపడుతున్నారు.

మా పోరాటం ఎవరికీ పట్టడం లేదు

ఎస్‌.కోట రూరల్‌, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): జిందాల్‌ కంపెనీ తమను మోసం చేసిందని బొడ్డవర గ్రామంలో గిరిజన, హరిజన, మైనార్టీలు శాంతియు తంగా పోరాటం చేస్తుంటే ఎవరికీ పట్టడం లేదని వారు మండిపడుతున్నారు. ఆదివారం బొడ్డవర గ్రామంలో 108వ రోజు రిలే నిరాహార దీక్షలో వారంతా పాల్గొన్నారు. ఎవరు ఎన్ని బెదిరింపులకు ప్రయత్నించినా న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదన్నారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం ఉపాధ్యక్షుడు చల్లా జగన్‌ ఉన్నారు.

Updated Date - Oct 06 , 2025 | 12:41 AM