ట్రంప్ విధిస్తున్న సుంకాలను వ్యతిరేకించాలి
ABN , Publish Date - Sep 07 , 2025 | 12:21 AM
ట్రంప్ విధిస్తున్న సుంకాలను వ్యతిరేకించాలని కార్మిక సం ఘాల ఐక్యవేదిక జిల్లా కార్యదర్శి సీహెచ్ రామూర్తి నాయుడు డిమాండ్ చేశారు.
రాజాం, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): ట్రంప్ విధిస్తున్న సుంకాలను వ్యతిరేకించాలని కార్మిక సం ఘాల ఐక్యవేదిక జిల్లా కార్యదర్శి సీహెచ్ రామూర్తి నాయుడు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం పాలకొండ రోడ్డులోని అంబేడ్కర్ కూడలి వద్ద నిరసన చేపట్టారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ సరుకులు దిగుమతిపై సుంకాన్ని 50 శాతానికి పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ప్రకటించ డంతో భారతీయ ఉత్పత్తుపై తీవ్ర ప్రభావం పడింద న్నారు. పలువురు కార్మిక సంఘ నాయకులు పాల్గొన్నారు.
భారతీయ సరుకుల దిగుమతిపై సుంకాన్ని నిర్ణయాన్ని అమెరికా వెనక్కి తీసుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఉల్లాకుల నీలకంఠేశ్వర యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం శ్రీనివాస థియే టర్ రోడ్డులో నిరసన చేపట్టారు.