Share News

Registration వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌కు సదవకాశం

ABN , Publish Date - Dec 08 , 2025 | 12:08 AM

Opportunity for Registration of Inherited Agricultural Lands వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్‌ ఫీజుల విషయంలో కూటమి ప్రభుత్వం మార్పులు తెచ్చింది. దీని ప్రకారం.. ఎకరం మార్కెట్‌ విలువ రూ.10 లక్షల లోపు ఉంటే.. ఇకపై స్టాంపు డ్యూటీగా రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. రూ.10 లక్షల పైన ఉంటే రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది.

  Registration వారసత్వ వ్యవసాయ భూముల  రిజిస్ట్రేషన్‌కు సదవకాశం
వ్యవసాయ భూమి

  • ఆస్తి విలువ రూ.10 లక్షల లోపు ఉంటే .. రూ.100 చెల్లిస్తే చాలు

పాలకొండ, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్‌ ఫీజుల విషయంలో కూటమి ప్రభుత్వం మార్పులు తెచ్చింది. దీని ప్రకారం.. ఎకరం మార్కెట్‌ విలువ రూ.10 లక్షల లోపు ఉంటే.. ఇకపై స్టాంపు డ్యూటీగా రూ.100 చెల్లిస్తే సరిపోతుంది. రూ.10 లక్షల పైన ఉంటే రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. జిల్లాలో వ్యవసాయ భూముల మార్కెట్‌ విలువ ఎకరం రూ.10 లక్షల లోపే ఉంది. పాలకొండ మండలంలో చూస్తే.. ఇక్కడ ఎకరం భూమి మార్కెట్‌ విలువ రూ.4 లక్షలుగా ఉంది. ఇదే ప్రాంతంలో వారసత్వంగా ఉన్న ఎకరా వ్యవసాయ భూమిని కుటుంబ సభ్యులు భాగ పంపిణీ ద్వారా రిజిస్ర్టేషన్‌ చేసుకుంటే రూ.400 స్టాంప్‌ డ్యూటీగా చెల్లిస్తే సరిపోతుంది. రిజిస్ర్టేషన్‌ పూర్తయిన వెంటనే ఆ భూమి వారసుల పేర్లుపై ఆటో మేటిక్‌గా మారుతుంది. జిల్లాలోని పాలకొండ, కురుపాం, పార్వతీపురం, సాలూరులో సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో రోజుకు సరాసరి 50 నుంచి 80 వరకు రిజిస్ర్టేషన్లు జరుగుతాయి. వాటిలో 50 శాతం వారసత్వ భూములు, ఇతర ఆస్తుల రిజిస్ర్టేషన్లే ఉంటాయి. తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ర్టేషన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. కాగా గత వైసీపీ ప్రభుత్వం అధికంగా స్టాంప్‌ డ్యూటీని వసూలు చేసేది. నేడు సగానికి పైగా చార్జీ తగ్గడంతో జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పాలకొండ సబ్‌ రిజిస్ర్టార్‌ శ్రీరామ్మూర్తిని వివరణ కోరగా.. ‘వారసత్వ వ్యవసాయభూములు రిజిస్ర్టేషన్‌, స్టాంప్‌ డ్యూటీ ఫీజులపై ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు రాలేదు. ప్రభుత్వ నిబంధనలు మేరకు రిజిస్ర్టేషన్‌ ప్ర క్రియ కొనసాగిస్తాం.’ అని తెలిపారు.

Updated Date - Dec 08 , 2025 | 12:08 AM