GO No. 3 జీవో నెంబర్-3పై అభిప్రాయ సేకరణ
ABN , Publish Date - Jul 17 , 2025 | 12:07 AM
Opinion Gathering on GO No. 3 పార్వతీపురం ఐటీడీఏలో గురువారం జీవో నెంబర్-3 అంశంపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు గిరిజన సంఘాలు, ప్రజా ప్రతి నిధులు, న్యాయవాదులు, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధుల అభిప్రాయాలను స్వీకరించనున్నారు. ఈ సమావేశానికి గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ భార్గవి హాజరు కానున్నారు.
హాజరుకానున్న గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్ భార్గవి
పార్వతీపురం, జూలై 16 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం ఐటీడీఏలో గురువారం జీవో నెంబర్-3 అంశంపై ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు గిరిజన సంఘాలు, ప్రజా ప్రతి నిధులు, న్యాయవాదులు, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధుల అభిప్రాయాలను స్వీకరించనున్నారు. ఈ సమావేశానికి గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ భార్గవి హాజరు కానున్నారు. అభిప్రాయ సేకరణ అనంతరం నివేదికను రూపొందించి ప్రభుత్వానికి అందజేయనున్నారు. దీని ఆధారంగా జీవో నెంబర్-3ను పునరుద్ధస్తారా లేక దాని స్థానంలో ప్రత్యామ్నాయ జీవోను తీసుకొస్తారా? అనేది వేచి చూడాల్సి ఉంది. వాస్తవంగా ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గతంలో టీడీపీ ప్రభుత్వమే జీవో నెంబరు 3ని అమలు చేసింది. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో న్యాయస్థానం తీసుకున్న నిర్ణయంతో అది రద్దయింది. దీనిపై నాటి సర్కారు స్పందించకపోగా.. న్యాయ పోరాటం కూడా చేయలేదు. దీంతో గిరిజన యువత ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న సీఎం చంద్రబాబునాయుడు జీవో నెంబరు 3 పునరుద్ధరణకు అడుగులు వేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చర్యలు చేపడుతున్నారు. కాగా అభిప్రాయ సేకరణకు పార్వతీపురం ఐటీడీఏలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఇన్‌చార్జి పీవో అశుతోష్ శ్రీవాత్సవ బుధవారం తెలిపారు. 17న ఉదయం 10:30 గంటలకు గిరిమిత్ర సమా వేశ మందిరంలో అవగాహన సదస్సు జరుగుతుందన్నారు. అందరూ తప్పక హాజరుకావాలని కోరారు.