Share News

OP 442 ఓపీ 442

ABN , Publish Date - Jul 14 , 2025 | 11:46 PM

OP 442 సీతంపేట ఏరియా ఆసుపత్రి రోగులతో కిటకిటలాడింది. సోమవారం ఓపీ 442గా నమోదైంది. 19మంది మలేరియాతో, 94 మంది వైరల్‌ జ్వరాలతో బాధపడుతున్నారు. కాగా వారిలో 49మంది ఇన్‌పేషెంట్లుగా ఆసుపత్రిలో చేరి వైద్యసేవలు పొందుతున్నారు.

OP 442  ఓపీ 442
ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జ్వరపీడితులు

  • సీతంపేట ఏరియా ఆసుపత్రి కిటకిట

సీతంపేట రూరల్‌, జూలై14(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏరియా ఆసుపత్రి రోగులతో కిటకిటలాడింది. సోమవారం ఓపీ 442గా నమోదైంది. 19మంది మలేరియాతో, 94 మంది వైరల్‌ జ్వరాలతో బాధపడుతున్నారు. కాగా వారిలో 49మంది ఇన్‌పేషెంట్లుగా ఆసుపత్రిలో చేరి వైద్యసేవలు పొందుతున్నారు. మిగిలిన వారు ఇతర ఆరోగ్య సమస్యలతో ఏరియా ఆసుపత్రికి వచ్చినట్లు సూప‌రింటెండెంట్‌ శ్రీనివాసరావు తెలిపారు. కాగా ఏజెన్సీలో ఏజెన్సీలో జ్వరాలు తగ్గుముఖం పట్టడం లేదు. ఎపిడమిక్‌ సీజన్‌ ప్రారంభం నుంచి మలేరియా, వైరల్‌ జ్వరాలతో గిరిజనులు వణుకుతున్నారు. వాతావరణం మార్పుల కారణంగా అధికసంఖ్యలో చిన్నారులు మంచం పడుతున్నారు. బొండి గ్రామానికి చెందిన శాత్విక్‌, అకిరానంద్‌ అనే చిన్నారులు చలి జ్వరంతో ఏరియా ఆసుపత్రిని ఆశ్రయించారు.

Updated Date - Jul 14 , 2025 | 11:46 PM