ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను రద్దు చేయాలి
ABN , Publish Date - Nov 30 , 2025 | 12:01 AM
:ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ను రద్దుచేయాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బూర వాసు డిమాండ్ చేశారు. శనివా రం విజయనగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట ఆన్‌లైన్ బెట్టింగ్ యాపులను రద్దు చేయాలని నిరసన తెలిపారు.
విజయనగరం దాసన్నపేట, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి):ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ను రద్దుచేయాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు బూర వాసు డిమాండ్ చేశారు. శనివా రం విజయనగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట ఆన్‌లైన్ బెట్టింగ్ యాపులను రద్దు చేయాలని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యాప్‌ల యాజమాన్యా లు తక్కువ ధరకే వడ్డీకి ఇస్తామని, బెట్టింగ్‌కు తగినంత మొత్తం ఇస్తామని చెప్పడం తో నమ్మిన యువత డౌన్‌లోడ్ చేసుకుని వాటికి బానిసలు అవుతున్నారని తెలిపారు. తీసుకున్న తరువాత వడ్డీలు కట్టలేక జీవితాలు నానశం చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. తక్షణమే యాపులను రద్దుచేసి యువతకు, ఆడపిల్లలకు రక్షణ కల్పించ కపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.