రైలు నుంచి జారిపడి ఒకరికి తీవ్ర గాయాలు
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:31 AM
మండలంలోని కూనేరు స్టేషన్ పరిధి లోగల రామభద్రపురం సమీపంలో అయినాడ జంక్షన్‌కు చెందిన తుమ్మపల్లి నారాయణరావు మంగళవారం తెల్లవారుజామున హిరాఖండ్ రైలు నుంచి జారి పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు.
కొమరాడ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కూనేరు స్టేషన్ పరిధి లోగల రామభద్రపురం సమీపంలో అయినాడ జంక్షన్‌కు చెందిన తుమ్మపల్లి నారాయణరావు మంగళవారం తెల్లవారుజామున హిరాఖండ్ రైలు నుంచి జారి పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. విజయనగరం నుంచి రాయగడ ఆలయానికి కుటుంబంతో కలిసి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు నారా యణరావును జిల్లా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం విజయన గరం తరలించారని జీఆర్పీ పోలీసులు తెలిపారు. రైల్వే హెచ్‌సీ రత్నకుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.