Share News

రోడ్డు ప్రమాదం కేసులో ఒకరికి జరిమానా

ABN , Publish Date - Dec 21 , 2025 | 12:09 AM

నగరంలోని వన్‌టౌన్‌ పోలీ సు స్టేషన్‌ పరిధిలో 2024లో నమోదైన రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడు నగరంలోని వీటీ అగ్రహారానికి చెందిన నక్కా గణేష్‌కు విజయనగరం స్పెషల్‌ మొబైల్‌ కోర్టు రెండో అడిషనల్‌ సివిల్‌ న్యాయాధికారి పి.బుజ్జెమ్మ రూ.14వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించినట్టు వన్‌టౌన్‌ సీఐ ఆర్‌వీఆర్‌కే చౌదరి తెలిపారు.

రోడ్డు ప్రమాదం కేసులో ఒకరికి జరిమానా

విజయనగరం క్రైం, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): నగరంలోని వన్‌టౌన్‌ పోలీ సు స్టేషన్‌ పరిధిలో 2024లో నమోదైన రోడ్డు ప్రమాదం కేసులో నిందితుడు నగరంలోని వీటీ అగ్రహారానికి చెందిన నక్కా గణేష్‌కు విజయనగరం స్పెషల్‌ మొబైల్‌ కోర్టు రెండో అడిషనల్‌ సివిల్‌ న్యాయాధికారి పి.బుజ్జెమ్మ రూ.14వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించినట్టు వన్‌టౌన్‌ సీఐ ఆర్‌వీఆర్‌కే చౌదరి తెలిపారు. జరిమానా చెల్లించడం గానీ, మూడు నెలల జైలు శిక్ష అనుభవిం చాల్సి గానీ ఉంటుందన్నారు. సీఐ స్థానిక విలేకర్లకు శనివారం తెలిపిన వివరా లు ఇలా ఉన్నాయి. కలెక్టరేట్‌ కార్యాలయ సమీపంలో 2024 ఏప్రిల్‌ 25న గుర్తు తెలియని వ్యక్తిని వాహనం ఢీకొట్టగా, ఆ వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందాడు. ఆ ప్రాంతానికి చెందిన వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతికతను వినియోగించి వాహనాన్ని కనిపెట్టి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌ కు తరలించారు. న్యాయస్థానంలో అభియోగ పత్రాలు దాఖలు చేయగా, నిందితుడిపై నేరారోపణలు రుజువు కావడంతో న్యాయాధికారి తీర్పు వెల్లడించినట్టు తెలిపారు. ఈ కేసులు క్రియాశీలకంగా వ్యవహరించిన ఏపీపీ విజయలక్ష్మీ, ఎస్‌ఐ నరేష్‌, కోర్టు కానిస్టేబుల్‌ స్రవంతిని సీఐ చౌదరి అభినందించారు.

Updated Date - Dec 21 , 2025 | 12:09 AM