భవనం పైనుంచి పడి ఒకరు మృతి
ABN , Publish Date - Aug 29 , 2025 | 12:25 AM
ప్రమాదవశాత్తు భవనం పై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పార్వతీపురం పట్టణంలోని గురువారం చోటు చేసుకుంది.
బెలగాం, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): ప్రమాదవశాత్తు భవనం పై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పార్వతీపురం పట్టణంలోని గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని గూడ్స్ షెడ్ రోడ్డులో నివసి స్తున్న బాడితి రాము(42) ఓ స్కూల్ సమీపంలోని రెండు ఫ్లోర్ల ఇంటికి పెయిం టింగ్ వేస్తున్నాడు. ప్రమాదవశాత్తు పైనుంచి పడిపోయాడు. ప్రహరీకి తల తగలడంతో మృతిచెందాడు. రాముకు తల్లి, ఇద్దరు సోదరీమణులు, నలుగురు అన్నదమ్ములు ఉన్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్టు తెలిపారు.