Share News

టైరుబండి కింద పడి ఒకరు మృతి

ABN , Publish Date - Sep 10 , 2025 | 12:00 AM

వేములాపల్లి గ్రామానికి చెందిన బి.సన్యాసిరావు(48) అనే వ్యక్తి ఇసుక టైరుబండి కింద పడి మృతి చెందారు.

 టైరుబండి కింద పడి ఒకరు మృతి

ఎస్‌.కోట రూరల్‌, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): వేములాపల్లి గ్రామానికి చెందిన బి.సన్యాసిరావు(48) అనే వ్యక్తి ఇసుక టైరుబండి కింద పడి మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సన్యాసిరావు వ్యవసా య కూలీ. ఎప్పటిలాగే మంగళవారం ఉదయం స్థానికంగా ఉన్న గోస్తనీ నదిలో కి ఇసుక సేకరణకు దిగారు. తన టైరుబండిలో ఇసుక నింపుకొని గట్టుపైకి వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కింద పడిపోయారు. దీంతో లోడుతో ఉన్న బండి టైరు గుండె పైనుంచి వెళ్లింది. ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య ఉమ, పిల్లలు భూవన్‌, మౌనిక ఉన్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు సీఐ నారాయణమూర్తి తెలిపారు.

Updated Date - Sep 10 , 2025 | 12:01 AM