కారు ఢీకొని ఒకరి మృతి
ABN , Publish Date - Sep 28 , 2025 | 12:11 AM
కారు ఢీకొని ఒకరు మృతిచెందిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం మరిపి వలస వద్ద శనివారం చోటు చేసుకుంది.
దత్తిరాజేరు/ సీతానగరం, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): కారు ఢీకొని ఒకరు మృతిచెందిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం మరిపి వలస వద్ద శనివారం చోటు చేసుకుంది. దత్తిరాజేరు మండలంలోని పాచలవల స గ్రామానికి చెందిన సిరిపురం రాము(49) రోజూలాగే శనివారం రైల్వే కూలి పనులకు పార్వతీపురం వెళ్లాడు. పనులు ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఆటోపై వస్తుండగా సీతానగరం మండలం మరిపివలస వద్ద దేవుడి భోజనాలు అవుతున్నాయి. భోజనాలు చేసేందుకు వెళ్లి, తిరిగి వ చ్చి రోడ్డు పక్కనే నిలబడ్డా డు. ఇంతలో పార్వతీపురం వైపు నుంచి బొబ్బిలి వైపు వెళ్తున్న కారు రామును వెనుక నుంచి బలంగా ఢీకొంది. దీంతో రాము తలకు తీవ్ర గాయాలయ్యాయి. తోటి కూలీలు బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. అక్కడ రాము చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య నారాయణమ్మ, కూతురు రమ్య, తల్లి గడ్డిమ్మ ఉన్నారు.