చికిత్స పొందుతూ ఒకరి మృతి
ABN , Publish Date - Oct 05 , 2025 | 12:13 AM
రోడ్డు ప్రమాదంలో గాయపడిన పి.తులసి(38) అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
గంట్యాడ, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో గాయపడిన పి.తులసి(38) అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. బుడనాపల్లి గ్రామానికి చెందిన తులిసి గత నెల 25న గొడియాడ గ్రామా నికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. అదుపు తప్పి వాహనం బోల్తా పడిం ది. దీంతో ఆయన తలకు తీవ్ర గాయమైంది. వెంటనే స్థానికులు జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందు తూ మృతిచెందాడు. అందిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సాయికృష్ణ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.