చికిత్స పొందుతూ ఒకరు మృతి
ABN , Publish Date - Aug 18 , 2025 | 12:18 AM
రామభద్రపురం శ్రీరామ్‌నగర్ కాలనీకి చెందిన గోర్జి రమేష్(44) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు.
రామభద్రపురం, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): రామభద్రపురం శ్రీరామ్‌నగర్ కాలనీకి చెందిన గోర్జి రమేష్(44) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. ఎస్‌ఐ వెలమల ప్రసాదరావు కథనం మేరకు.. రమేష్ ఈనెల 15న కడుపునొప్పి తాళలేక చినమ్మతల్లి ఆలయం ద గ్గర పురుగు మందు తాగాడు. విషయం తెలుసుకున్న బంధువులు బాడంగి ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం అక్కడి నుంచి విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. భార్య కృష్ణవేణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.