చికిత్స పొందుతూ ఒకరు మృతి
ABN , Publish Date - Aug 11 , 2025 | 12:07 AM
రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు.
లక్కవరపుకోట, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనపై హెచ్‌సీ పాపారావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చినమన్నిపాలెం గ్రామానికి చెందిన బొబ్బరి వెంకటేష్(24) గతనెల 29న జమ్మాదేవిపేట బ్రిడ్జి సమీపంలో బైకుతో ఆటోను ఢీకొట్టిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే కేజీహెచ్‌లో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందాడు. ఇదే ప్రమాదంలో మరో వ్యక్తి అదే రోజు మృతిచెందిన విషయం తెలిసిందే.