Share News

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

ABN , Publish Date - May 01 , 2025 | 12:33 AM

భోగాపురంలోని చాకివలస జంక్షన్‌ సర్వీస్‌ రోడ్డు బస్‌షెల్టర్‌ సమీపంలో ప్రమాదవశాత్తు కాకినాడకు చెందిన కంద ఉమామహేశ్వరరావు(32) మంగళవారం అర్ధరాత్రి మృతి చెందినట్టు ఏఎస్‌ఐ ఖాన్‌ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

భోగాపురం, ఏప్రిల్‌30 (ఆంధ్రజ్యోతి): భోగాపురంలోని చాకివలస జంక్షన్‌ సర్వీస్‌ రోడ్డు బస్‌షెల్టర్‌ సమీపంలో ప్రమాదవశాత్తు కాకినాడకు చెందిన కంద ఉమామహేశ్వరరావు(32) మంగళవారం అర్ధరాత్రి మృతి చెందినట్టు ఏఎస్‌ఐ ఖాన్‌ తెలిపారు. పోలీసుల వివరాల మేరకు.. కాకినాడకు చెందిన ఉమామమేశ్వరరావు లింగాలవలస సమీపంలో పెట్రోల్‌ బంకులో పని చేస్తున్నాడన్నారు. శ్రీకాకుళం నుంచి విశాఖ వెళ్లే సర్వీసు రోడ్డులో భోగా పురం నుంచి తగరపువలస వైపు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా చాకివలస జంక్షన్‌ బస్‌షెల్టర్‌ వద్ద ప్రమాదవశాత్తు పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడకక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోవు చేశామని ఏఎస్‌ఐ తెలిపారు.

Updated Date - May 01 , 2025 | 12:33 AM