మద్యం మత్తులో మంచంపై నుంచి పడి ఒకరు మృతి
ABN , Publish Date - Oct 14 , 2025 | 11:55 PM
మండలంలోని పిరిడి గ్రామాని కి చెందిన కర్రి రామారావు (62) సోమవారం రాత్రి మద్యం మత్తులో మంచం పైనుంచి కిందపడడంతో మృతిచెందాడు.
బొబ్బిలి రూరల్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పిరిడి గ్రామాని కి చెందిన కర్రి రామారావు (62) సోమవారం రాత్రి మద్యం మత్తులో మంచం పైనుంచి కిందపడడంతో మృతిచెందాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. తెల్లవారుజామున భార్య అప్పలనరసమ్మ లేచి చూసేసరికి రక్తం మడుగులో ఉన్న భర్త రామారావును చూసి ఇరుగు పొరుగు వారిని పిలిచి విషయం తెలి యజేసింది. దీంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం తెలియజేశారు. సీఐ సతీష్‌కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది గ్రామానికి వెళ్లి దర్యాప్తు నిర్వహించారు. కాగా పోలీసులు వెళ్లే సరికి రామారావు మృత దేహానికి దహన సంస్కారాలు పూర్తవడంతో భార్య వద్ద వాంగ్మూలం తీసుకున్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని సీఐ సతీష్‌కుమార్ తెలిపారు. రామారావు మద్యం విపరీతంగా తీసుకోవడం వల్ల మృతి చెందాడని ఆయన భార్య పేర్కొన్నట్లు చెప్పారు.