లారీ నుంచి జారిపడి ఒకరి మృతి
ABN , Publish Date - Dec 24 , 2025 | 12:13 AM
మండలంలోని గంగాపు రం పంచాయతీ హిందూపురం జంక్షన్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు.
పార్వతీపురం రూరల్, డిసెంబరు23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గంగాపు రం పంచాయతీ హిందూపురం జంక్షన్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. పశువుల దాణాతో వచ్చిన లారీ నుంచి బస్తాలు అన్‌లోడ్ చేస్తుండగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసకు చెందిన పల్లి తారకేశ్వరరావు(36) జారి పడ్డాడు. అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై పార్వతీపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.