మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య
ABN , Publish Date - Sep 14 , 2025 | 11:31 PM
పట్టణంలోని బంగారమ్మ కాలనీ గొడగల వీధికి చెందిన జలుమూరు సాయి(34) మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నాడు.
సాలూరు, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని బంగారమ్మ కాలనీ గొడగల వీధికి చెందిన జలుమూరు సాయి(34) మద్యానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. మద్యానికి బానిసైన సాయి భార్యా పిల్లలకు దూరంగా ఉంటున్నాడు. మద్యం తాగడం వల్ల అనారోగ్యం పాలవ్వడంతో పాటు మనస్తాపానికి గురయ్యాడు. దీంతో ఆదివారం ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందాడు. మృతుడి కి భార్య ప్రేమలత, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. ఈ ఘటనపై పట్టణ ఎస్‌ఐ జి.శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు.