కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి
ABN , Publish Date - Aug 19 , 2025 | 12:16 AM
మునిసిపాలిటీలో ఆప్కాస్ విధానంలో పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తూ ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాల్లో ఉన్న ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు.
కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి
పార్వతీపురంటౌన్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి):
మునిసిపాలిటీలో ఆప్కాస్ విధానంలో పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తూ ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాల్లో ఉన్న ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద మృతి చెందిన కుటుంబాలకు న్యాయం చేయాలని సీఐటీయూ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవో- 25 ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఆప్కాస్‌లో పనిచేస్తూ మృతి చెందిన కార్మిక కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్కారని తెలిపారు. పార్వతీపురం మునిసిపాలిటీలో పనిచేస్తూ మృతి చెందిన వారి కుటుంబాలకు కూడా ఉద్యోగం ఇవ్వాలని కోరారు.