Share News

ఆటో ఢీకొని ఒకరి మృతి

ABN , Publish Date - Sep 05 , 2025 | 12:26 AM

మండలంలోని రంగరాయపు రం జంక్షన్‌ సమీపంలో బైకు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో బైకిస్టు అక్కడికక్కడే మృతిచెందాడు.

 ఆటో ఢీకొని ఒకరి మృతి

లక్కవరపుకోట, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): మండలంలోని రంగరాయపు రం జంక్షన్‌ సమీపంలో బైకు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో బైకిస్టు అక్కడికక్కడే మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. వేపాడ మండలం చామలాపల్లి గ్రామాని కి చెందిన పెద్దాడ అర్జునరావు(32) విశాఖ జిల్లా చినముసిడివాడలో భార్య, కుమారునితో కలిసి నివాసం ఉంటున్నాడు. గురువారం రాత్రికి తమ స్వగ్రామం లోని వినాయక నిమజ్జనం కార్యక్రమానికి హాజరు కావడానికి విశాఖ నుంచి వస్తున్నాడు. ఎల్‌.కోట మండలం రంగరాయపురం జంక్షన్‌ సమీపంలోకి వచ్చే సరికి ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచా డు. ఈ ఘటనపై ఎస్‌ఐ నవీన్‌పడాల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Sep 05 , 2025 | 12:26 AM