Share News

రైలు ఢీకొని ఒకరి మృతి

ABN , Publish Date - Aug 26 , 2025 | 12:35 AM

మండలంలోని దేవాడ పంచాయతీ కోనమశివానిపాలెం గ్రామానికి చెందిన కోన అప్పలనాయుడు(58) రైలు ఢీకొని సోమవారం మృతిచెందాడు.

రైలు ఢీకొని ఒకరి మృతి

కొత్తవలస, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): మండలంలోని దేవాడ పంచాయతీ కోనమశివానిపాలెం గ్రామానికి చెందిన కోన అప్పలనాయుడు(58) రైలు ఢీకొని సోమవారం మృతిచెందాడు. రైల్వేలో కాంట్రాక్టర్‌ వద్ద రోజువారీ కూలీగా పని చేస్తున్న అప్పలనాయుడు ప్రతిరోజూ కోనమశివానిపాలెం నుంచి విశాఖపట్టణం వెళ్తుంటాడు. సోమవారం ఉదయం కొత్తవలస నుంచి బయదేరి వెళ్లిన అప్పలనాయుడు దువ్వాడ రైల్వేస్టేషన్‌ వద్ద పట్టాలపై పనిచేస్తుండగా.. తన వైపు వస్తున్న రైలును గమనించలేదు. రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, నర్శింగరావు అనే కుమారుడు ఉన్నారు.

Updated Date - Aug 26 , 2025 | 12:35 AM