లారీ ఢీకొని ఒకరి మృతి
ABN , Publish Date - Sep 14 , 2025 | 11:34 PM
మండలంలోని పెదమానాపురం టోల్‌ప్లాజా వద్ద లారీ ఢీకొని హిజ్రా మృతిచెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది.
దత్తిరాజేరు, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): మండలంలోని పెదమానాపురం టోల్‌ప్లాజా వద్ద లారీ ఢీకొని హిజ్రా మృతిచెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. మానాపురం పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పెదమానాపురం టోల్‌ప్లాజా వద్ద ఒక హిజ్రా నడుచుకుంటూ వెళ్తుండగా.. రామభద్రపురం వైపు నుంచి విజయనగరం వైపు వెళ్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో హిజ్రా తలకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ ఆర్.జయంతి తెలిపారు.