లారీ ఢీకొని ఒకరి మృతి
ABN , Publish Date - Sep 09 , 2025 | 12:00 AM
లారీ ఢీకొని ఒకరు మృతిచెందిన ఘటన మరడాం జంక్షన్ వద్ద సోమవారం చోటుచేసుకుంది.
దత్తిరాజేరు, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): లారీ ఢీకొని ఒకరు మృతిచెందిన ఘటన మరడాం జంక్షన్ వద్ద సోమవారం చోటుచేసుకుంది. స్టేషన్ బూర్జవలస పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం సాయంత్రం మరడాం జంక్షన్ వద్ద రాయపూర్ నుంచి వైజాగ్ పోర్టుకు బియ్యం లోడుతో వెళ్తున్న లారీ.. రోడ్డు దాటుతున్న మెంటాడ పంచాయతీ మర్రివలస గ్రామానికి చెందిన కోరాడ లక్ష్మరావు(42)ను బలంగా ఢీకొంది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నారు. వినాయక నిమజ్జనం నిమిత్తం వచ్చిన ఆయన ఈ ప్రమాదం లో మృతిచెందారు. మృతదేహాన్ని విజయనగరం జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుడి అన్నయ్య రామునాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.