Share News

CVAP Team నియోజకవర్గానికో సీవీఏపీ టీం

ABN , Publish Date - Sep 25 , 2025 | 12:01 AM

One CVAP Team for Each Constituency స్వర్ణాంధ్ర విజన్‌ 2047 సాధనకు ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో కానిస్టెంట్‌ విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌ ( సీవీఏపీ )ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు జిల్లాలో సాలూరు, కురుపాం, పార్వతీపురం, పాలకొండ నియోజకవర్గాలకు నాలుగు సీవీఏపీ టీంలను ఏర్పాటు చేశారు.

 CVAP Team నియోజకవర్గానికో సీవీఏపీ టీం
విలేజ్‌ ప్లానింగ్‌పై సాలూరు ఎంపీడీవోతో చర్చిస్తున్న సీవీపీఏ టీం

సాలూరు రూరల్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి ): స్వర్ణాంధ్ర విజన్‌ 2047 సాధనకు ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో కానిస్టెంట్‌ విజన్‌ యాక్షన్‌ ప్లాన్‌ ( సీవీఏపీ )ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు జిల్లాలో సాలూరు, కురుపాం, పార్వతీపురం, పాలకొండ నియోజకవర్గాలకు నాలుగు సీవీఏపీ టీంలను ఏర్పాటు చేశారు. ఈ టీం నియోజక వర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై సర్వే చేపట్టి ప్లానింగ్‌ చేయనున్నాయి. మౌలిక వసతులు, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ తదతర అంశాలను గుర్తించనున్నాయి. వాటి అమలుకు వీలుగా ప్రజాప్రతినిధుల సమన్వయంతో ప్రణాళికలు తయారు చేయను న్నాయి. వాటిని జిల్లాలో ఉన్న ఛీప్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ ( సీపీవో )కు అందించ నున్నాయి. ఈ టీంలు ప్రస్తుతం గ్రామస్థాయిలో ప్లానింగ్‌ కార్యక్రమం నిర్వహిస్తు న్నాయి. సాలూరులో సీవీఏపీ టీం యంగ్‌ ఫ్రొఫెషన్‌ బి. తాతారావు ఆధ్వర్యంలో నలుగురు సభ్యులు విలేజ్‌ ప్లానింగ్‌ కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. బుధవారం ఈ టీం సాలూరు ఎంపీడీవో గొల్లపల్లి పార్వతితో సమావేశమై పలు అంశాలను చర్చించింది.

Updated Date - Sep 25 , 2025 | 12:01 AM