పురుగు మందు తాగి ఒకరు ఆత్మహత్య
ABN , Publish Date - Sep 02 , 2025 | 11:45 PM
కలవరాయి గ్రామానికి చెందిన ఎద్దుబోను ఆదినారాయణ(44) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
బొబ్బిలి రూరల్, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): కలవరాయి గ్రామానికి చెందిన ఎద్దుబోను ఆదినారాయణ(44) పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లో వెళితే.. కొద్ది కాలంగా ఆయన ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో తన భార్య మంగమ్మ కూరగాయలకు బయటకు వెళ్లింది. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆయన ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగారు. ఇంటికి వచ్చిన భార్య విషయం తెలుసుకుని బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించింది. మెరుగైన చికిత్స కోసం ఆయనను విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. అదేరోజు రాత్రి 9 గంటలకు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతిచెందారు. మృతుడికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. పెద్ద కుమారుడు ఇంటర్మీడియట్ చిన్న కుమారుడు 8వ తరగతి చదువుతున్నారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏఎస్‌ఐ సన్యాసిరావు కేసు నమోదు చేశారు.