వివాహిత ఆత్మహత్య కేసులో ఒకరి అరెస్టు
ABN , Publish Date - Aug 24 , 2025 | 11:39 PM
మండలంలోని పిడిశీల గ్రామంలో వివాహిత ఆత్మహత్యకు గురైన కేసులో యడ్ల ఈశ్వరరావు అనే వ్యక్తిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్టు ఎస్‌ఐ కె.కిరణ్‌కుమార్‌నాయుడు తెలిపారు.
గజపతినగరం, ఆగస్టు24(ఆంధ్రజ్యోతి): మండలంలోని పిడిశీల గ్రామంలో వివాహిత ఆత్మహత్యకు గురైన కేసులో యడ్ల ఈశ్వరరావు అనే వ్యక్తిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్టు ఎస్‌ఐ కె.కిరణ్‌కుమార్‌నాయుడు తెలిపారు. ఆదివారం ఆయన స్థానిక పోలీస్‌స్టేషన్‌లో విలేకర్లకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. పిడిశీల గ్రామానికి చెందిన కర్రోతు సాయిసుధతో అదే గ్రామా నికి చెందిన యడ్ల ఈశ్వరరావు గత 11ఏళ్లుగా పరిచయం ఏర్పర్చుకున్నాడు. అనుమానంతో ఆమెను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేసేవాడు. దీంతో ఆమె మనస్థాపం చెంది ఇంట్లో తన భర్త, పిల్లలు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. మృతురాలి తల్లి పల్లి వరలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు గ్రామంలోని పెద్దలతో పాటు బంధువుల నుంచి వివరాలు సేకరించారు. సాక్ష్యాదారాల మేరకు పోలీసులు ఈశ్వరరావును అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు.