Elephants! అమ్మో.. గజరాజులు
ABN , Publish Date - Jul 12 , 2025 | 11:16 PM
Oh no.. Wild Elephants! గరుగుబిల్లి మండలం గిజబ ప్రాంతంలో శనివారం గజరాజులు ప్రత్యక్షమయ్యాయి. శుక్రవారం నందివానివలసలో సంచరించిన తొమ్మిది ఏనుగులు మరోసారి గిజబలో సంచరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
గరుగుబిల్లి, జూలై 12 (ఆంధ్రజ్యోతి): గరుగుబిల్లి మండలం గిజబ ప్రాంతంలో శనివారం గజరాజులు ప్రత్యక్షమయ్యాయి. శుక్రవారం నందివానివలసలో సంచరించిన తొమ్మిది ఏనుగులు మరోసారి గిజబలో సంచరించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖరీఫ్ వ్యవసాయ పనులకు ఆటంకం నెలకొందని వారు తెలియజేస్తున్నారు. వాటి కారణంగా నష్టం వాటిల్లిన పంటలకు నేటికీ పరిహారం అందలేదని మరికొందరు వాపోయారు. తక్షణమే సీతానగరం మండలం గుచ్చిమి ప్రాంతంలో ఏనుగులు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసి గజరాజులను అక్కడకు తరలించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
గుండం సరిహద్దులో...
సీతంపేట రూరల్: సీతంపేట, మొండింఖల్ సరిహద్దు ప్రాంతంలోని గుండంలో గజరాజులు సంచరిస్తున్నట్లు అటవీశాఖ బీట్ అధికారి దాలినాయుడు తెలిపారు. శనివారం ఉదయానికి వెదురువాడ కొండ ప్రాంతం నుంచి సరిహద్దు గ్రామమైన గుండం వైపు అవి కదిలినట్లు వెల్లడిం చారు. సీతంపేట ఏజెన్సీ నుంచి కురుపాం, గుమ్మలక్ష్మీపురం వైపు ఏనుగులు తరలిపోయినట్లు వెల్లడించారు. వాటిని ట్రాకర్స్ పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.