Share News

Rising Fevers బాబోయ్‌ జ్వరాలు

ABN , Publish Date - Jun 17 , 2025 | 12:11 AM

Oh No! Rising Fevers సీతంపేట మన్యంలో జ్వరాలు పంజా విసురుతున్నాయి. గడిచిన కొద్ది రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకో వడంతో ప్రజలు ఆరోగ్య సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రధానంగా వైరల్‌ జ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

 Rising Fevers బాబోయ్‌ జ్వరాలు
రక్తపరీక్షల కోసం వేచిఉన్న జ్వరపీడితులు

  • పెరుగుతున్న వైరల్‌ జ్వరబాధితుల సంఖ్య

  • కిక్కిరిసిన ఏరియా ఆసుపత్రి

సీతంపేట రూరల్‌, జూన్‌16(ఆంధ్రజ్యోతి): సీతంపేట మన్యంలో జ్వరాలు పంజా విసురుతున్నాయి. గడిచిన కొద్ది రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకో వడంతో ప్రజలు ఆరోగ్య సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రధానంగా వైరల్‌ జ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏజెన్సీలో మలేరియా తగ్గుముఖం పట్టినప్పటికీ విష జ్వరాలు మాత్రం గిరిజనులను పట్టి పీడిస్తున్నాయి. జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు, కాళ్ల పీకులు వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. కొందరు గ్రామాలకే పరిమితమవగా.. మరికొందరు ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు.జ్వరపీడితులతో సోమవారం ఏరియా ఆసుపత్రి కిక్కిరిసింది. 349 వరకు ఓపీ రాగా వారిలో 91 మంది వైరల్‌ జ్వరాలతో, 23 మంది మలేరియాతో బాధపడుతున్నట్లు రక్తపరీక్షల్లో నిర్ధారణ అయ్యింది. 39 మంది జ్వరపీడితులు ఏరియా ఆసుపత్రిలో ఇన్‌పేషెంట్లుగా చేరి వైద్యసేవలు పొందుతున్నట్లు ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ డీవీ శ్రీనివాసరావు తెలిపారు.

Updated Date - Jun 17 , 2025 | 12:11 AM