అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి: లోకం
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:00 AM
మౌలిక సదుపాయాలు కల్పనకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి కోరారు. ప్రాధాన్యతా క్రమంలో సమస్యలను పరిష్కరిస్తామని హామీఇచ్చారు.
డెంకాడ, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): మౌలిక సదుపాయాలు కల్పనకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి కోరారు. ప్రాధాన్యతా క్రమంలో సమస్యలను పరిష్కరిస్తామని హామీఇచ్చారు. గురువారం మండలంలోని బంటుపల్లిలో మన ప్రజలతో- మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఎమ్మెల్యే ప్రజల నుంచి వినతులు స్వీకరించా రు. కార్యక్రమంలో ఎంపీపీ బంటుపల్లి వాసుదేవరావు, జనార్దనరావు, సంఘం సురేష్, రవికుమార్, భవిరిశెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు.