అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి
ABN , Publish Date - Aug 15 , 2025 | 12:21 AM
:జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని గిరిజన సంక్షేమశాఖామంత్రి గుమ్మడి సంధ్యారాణి కోరారు. గురువారం సాయంత్రం జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్ శ్యాంప్రసాద్‌తో చర్చించారు.స్వాతంత్య్రదినోత్సవం లో పాల్గొనేందుకు వచ్చే విద్యార్థులపై జాగ్రత్తలు తీసుకోవాలని, ఉపాధ్యాయులు పాఠశాలల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండా లని కోరారు.
పార్వతీపురం/సాలూరు, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి):జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని గిరిజన సంక్షేమశాఖామంత్రి గుమ్మడి సంధ్యారాణి కోరారు. గురువారం సాయంత్రం జిల్లాలో వర్షాలు కురుస్తుండడంతో తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్ శ్యాంప్రసాద్‌తో చర్చించారు.స్వాతంత్య్రదినోత్సవం లో పాల్గొనేందుకు వచ్చే విద్యార్థులపై జాగ్రత్తలు తీసుకోవాలని, ఉపాధ్యాయులు పాఠశాలల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండా లని కోరారు. రైతులు, మత్స్యకారులు అ ప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడడం, రోడ్లపై రాకపోకలు బంద్ కావడం, స్తంభాలు పడిపోవడం తదితర కారణా లతో విద్యుత్ సరఫరా నిలిచిపోయే సమస్య ఉత్పన్నమయ్యే అవకా శం ఉంటుందని పేర్కొన్నారు.
వైద్య సిబ్బందికి ప్రశంసాపత్రాలు
సాలూరు, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి):సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బం ది అందిస్తున్న సేవలు, నిబద్దత, సమయపాలన గుర్తించి వారికి మంత్రి గుమ్మిడి సంధ్యారాణి గురువారం ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమం లో స్థానిక ప్రజాప్రతినిదులు, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
సీఎంపై తప్పుగా మాట్లాడితే ప్రజలు సహించరు
ప్రజలు జగన్మోహన్‌రెడ్డిని ఎంతగా వ్యతిరేకిస్తున్నారో అని చెప్పడానికి పులివెందుల, ఒంటిమిట్టలో జరిగిన ఉపఎన్నికలే నిదర్శనమని, పులివెందులలో ప్రజాస్వామ్యం ప్రాణంపోసుకుందని, రెండు చోట్ల టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. గురువారం సాలూరులో ఆమె విలేకరులతో మాట్లాడుతూ తమ నాయకుడు, రాష్ట్ర ముఖ్య మంత్రిపై తప్పుగా మాట్లాడితే ప్రజలు సహించరని తెలిపారు. రామా...కృష్ణా అని ఆయన కుర్చొని ఉంటే ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్‌రెడ్డి సర్వనాశనం చేసేసే వారని తెలిపారు.జగన్మోహన్‌రెడ్డికి పిచ్చి బాగా ముదిరిపోయిందని, ఏదో మెం టల్ ఆసుపత్రిలో చేరాలని అలా కాకుంటే తాడేపల్లి గూడెంలో తన ప్యాలెస్‌లో ఉండాలని, అదీ కాకుంటే బెంగళూరులో తన కోటలో నివాసం ఉండాలని ఆమె సలహా ఇచ్చారు.సమావేశంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు (చిట్టీ), కౌన్సిలర్ హర్షవర్ధన్, వాడాడ శోభారాణితోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.