odisha to kerala ఒడిశా టు కేరళ
ABN , Publish Date - Nov 16 , 2025 | 12:11 AM
odisha to kerala బత్తిలి చెక్‌పోస్టు వద్ద శుక్రవారం ఆపకుండా దూసుకెళ్లిన కారును పోలీసులు వెంబడించి పట్టుకున్న సంగతి తెలిసిందే. సినీ ఫక్కీలో ఇద్దరు నిందితులను పట్టుకుని గంజాయి ప్యాకెట్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. శనివారం బత్తిలి పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు వివరాలను పాలకొండ డీఎస్పీ రాంబాబు వెల్లడించారు.
చెక్‌పోస్టును దాటి దూసుకెళ్లిన కారు
సినీ ఫక్కీలో చిక్కిన నిందితులు
వివరాలు వెల్లడించిన డీఎస్పీ రాంబాబు
భామిని, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): బత్తిలి చెక్‌పోస్టు వద్ద శుక్రవారం ఆపకుండా దూసుకెళ్లిన కారును పోలీసులు వెంబడించి పట్టుకున్న సంగతి తెలిసిందే. సినీ ఫక్కీలో ఇద్దరు నిందితులను పట్టుకుని గంజాయి ప్యాకెట్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా.. శనివారం బత్తిలి పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు వివరాలను పాలకొండ డీఎస్పీ రాంబాబు వెల్లడించారు. ‘కేరళకు చెందిన ప్రతాప్‌సింగ్, నదిమ్ సునీల్ కొద్దిరోజుల కిందట ఒడిశాలోని నవరంగ్‌పూర్‌కు చెందిన వ్యక్తితో ఫోన్‌లో సంప్రదించారు. అనంతరం బలాంగిరిలో గంజాయిని కొనుగోలు చేశారు. అక్కడి నుంచి కారులో వారు బత్తిలి మీదుగా కేరళకు వెళ్తుండగా.. స్థానిక పోలీసులు వెంబడించి వారిని పట్టుకున్నారు.’ అని డీఎస్పీ తెలిపారు. కారులో 53 ప్యాకెట్లలో క్వింటా ఐదు కిలోల గంజాయి ఉందన్నారు. వాటిని రూ. రెండు లక్షల కొనుగోలు చేసినట్టు నిందితులు వెల్లడించారన్నారు. అయితే గంజాయిని ఎక్కడ నుంచి ఎక్కడికి తరలి స్తున్నారనే దానిపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా... రిమాండ్ విధించినట్లు వెల్లడించారు. అనంతరం బత్తిలి చెక్‌పోస్టు సిబ్బంది, పోలీసులను అభినందించారు. ఈ మీడియా సమావేశంలో పాలకొండ సీఐ ఎం. ప్రసాద్, ఎస్‌ఐ అప్పారావు, సిబ్బంది పాల్గొన్నారు.